పాలకొండ వెబ్ న్యూస్ :నేటితో కార్తీకమాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాలకొండ పట్టణంలోని ప్రసిద్ధ వెంకటరాయిని కోనేరు వద్ద మహిళలకు కార్తీక దీపాలు పెట్టుకునేందుకు సౌకర్యం కల్పించేందుకు కూటమి నాయకులు ముందుకొచ్చారు. చెరువు చుట్టూ ఉన్న రేవులను శుభ్రపరచి, మార్గాలను సరిచేసి, దీపాల వేడుకకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు గంటా సంతోష్, నగర పంచాయతీ చైర్మన్ ప్రతినిధి అకుల కుమార్, కౌన్సిలర్లు కొంచాడ అరుణ్ కుమార్, కోరికనా గంగు నాయుడు, జెనసేన నాయకులు కొండాదాడి రాజేష్ పాల్గొన్నారు.
మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.నాయకులు మాట్లాడుతూ — కార్తీకమాసం ఆధ్యాత్మికతకు ప్రతీకమని, ఈ నెలలో దీపాల వేడుకలు సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. News by BSS Prasad.
0 Comments