పాలకొండ వెబ్ న్యూస్ : అక్టోబర్ 17: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని MRPS మన్యం జిల్లా అధ్యక్షుడు బోసు మన్మథరావు మాదిగ డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం పాలకొండ తహసీల్దార్ రాధాకృష్ణమూర్తికి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అక్టోబర్ 7, 2025న రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సీజేఐ గవాయ్ బెంచ్‌పై షూ విసిరి దాడి చేయడం అనాగరికమని ఆయన ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. దళితుడైన గవాయ్‌ను సీజేఐగా ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి, స్వతంత్ర దర్యాప్తు ద్వారా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కళింగ ప్రేమభూషణ రావు,, నులక జోడు ప్రదీప్ కుమార్, యందవ సుదర్శన్ రావు , సారికి రమేష్, సార్ సంజీవి, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. News By BSS Prasad

0 Comments