పోలీసుల అమరవీరుల దినోత్సవం: పాలకొండలో మెగా రక్తదాన శిబిరం


కళాభారతి న్యూస్ & పాలకొండ వెబ్ న్యూస్ : ​పార్వతీపురం మన్యం జిల్లా: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరావు ఆదేశాల మేరకు పాలకొండలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. పాలకొండ డి.ఎస్.పి రాంబాబు గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 8 గంటలకు పాలకొండ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ శిబిరం ప్రారంభమవుతుంది.

​      రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి రక్తం లేక ఇబ్బంది పడుతున్న ఎందరో అభాగ్యులకు రక్తాన్ని అందించి, మరొకరికి ప్రాణం పోయాలని కోరారు. సేకరించిన రక్తాన్ని పాలకొండ ఏరియా హాస్పిటల్‌లోనే ఉంచుతామని తెలిపారు.

​     ఈ  కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని, రక్తదానం చేసి మరొకరికి జీవం పోయాలని, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని పోలీసులు కోరారు. "రండి, రక్తదానం చేద్దాం, ప్రాణాలు కాపాడుదాం" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. News by BSS Prasad

Post a Comment

0 Comments