పాలకొండ జిల్లా కోసం రిలే దీక్షలు ప్రారంభం

palakonda web news
 

కళాభారతి న్యూస్ / పాలకొండ వెబ్ న్యూస్ : 28.10.2025 News by BSS Prasad

         పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పాలకొండను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఉద్యమం ఉధృతమవుతోంది. ఇందుకుగాను, ఈనెల 31వ తేదీ నుండి పాలకొండ పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సాధన సమితి నిర్ణయించింది.

       తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇన్చార్జి మంత్రి అచ్చన్నాయుడులను కలిసి పాలకొండను ప్రత్యేక జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని కోరుతూ విజ్ఞప్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు. 



       ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, కార్యదర్శి వండాన కూర్మారావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణతో పాటు తుమ్మగుంట శంకరరావు, కడగల వెంకట రమణ, రుంకు రామకృష్ణ, కిల్లారి విజయ్ కుమార్, నెల్లి సత్యం నాయుడు, గిరడ రాము, రుద్ర కోటేశ్వరరావు, గిరడ లక్ష్మణరావు, కడగల భాను, జడ్డు బాలరాజు, బెజ్జపురం చిన్నమనాయుడు, ఎందవ రాధాకృష్ణ, బుక్కూరు కృష్ణారావు, అల్లిన శ్రీనివాసు, కిల్లారి మోహన రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments