మొంథా తుఫాన్: పాలకొండ రైతన్నకు భారీ నష్టం!

మొంథా తుఫాన్: పాలకొండ రైతన్నకు భారీ నష్టం!

పాలకొండ వెబ్ న్యూస్: మొంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాలకొండ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా, అభ్యుదయ రైతు ప్రసాదరావు పొలంలో కోతకు సిద్ధంగా ఉన్న వరిపై నీరు చేరింది. మూడు రోజులు నిరంతరంగా వర్షం పడటం వల్ల నేలకొరిగిన వరి వెన్నులు తడిచి మొలకలు మొలిచాయి.విత్తనాలుగా అందించాలనుకున్న పంట నాశనమైంది" అని ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికందిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments