కళాభారతి న్యూస్ (పాలకొండ వెబ్ న్యూస్):
పాలకొండ పూర్వపు రెవెన్యూ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలో తొలిరోజు దీక్షా శిబిరంలో కూర్చున్నవారికి శుక్రవారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జె. కామేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు శివప్రసాద్, కె.వి. రమణ, బీసీ నాయకులు మీడియా సభ్యులు ఎం. గణేష్ నాయుడులు హాజరయ్యారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం అందించడం ద్వారా వారి నిరసనను విరమింపజేశారు. పాలకొండను జిల్లాగా చేయాలనే లేదా శ్రీకాకుళం జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ఈ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. News by BSS Prasad.

0 Comments