పాలకొండ వెబ్ న్యూస్ (కళాభారతి న్యూస్ ): ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి పాలకొండ నగర పంచాయతీలోని 15, 16, 17, 18, 19 వార్డులలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ కార్యక్రమం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ వెలమల మన్మథరావు, కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, కడగల రమణ, కిల్లారి మోహన్, తుమ్మగుంట శంకరరావు, కోడెం బాబీ, పల్లా భాను, నీలాపు శ్రీను స్వామి, కోరాడ సూర్యనారాయణ, కె. విజయ కుమార్, మిడితాన సూర్యనారాయణ, గార వెంకటరమణ, పైల అక్కయ్య, మరియ దాస్, సుంకరి ధర్మ, తుమ్మగుంట జగదీష్, తుంబలి వాసుదేవ రావు, దాసరి నాగేశ్వరరావు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను దెబ్బతీస్తుందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేశారని తెలిపారు.

0 Comments