ఈ నెల 16న శిష్టకరణ వన సమారాధన

పాలకొండ వెబ్ న్యూస్ | పాలకొండ
పాలకొండ సిస్టకరణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న, ఆదివారం, వన సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలంలోని పాలకొండ పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయం దగ్గర, విశాఖ రోడ్డు, ఎన్ఎస్ఎన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు..ఈ మేరకు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఐఏఎన్ పట్నాయక్, అధ్యక్షులు బాసూరు శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి సాహిని శ్రీనివాసరావు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐక్యతే లక్ష్యంగా కార్తీక సమారాధన 
పాలకొండ పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో గల  శిష్టకరణ బంధువులు, కుటుంబ సమేతంగా ఒకే వేదికపై కలుసుకుని, సంబంధాలను పెంపొందించు కోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కార్తీక సమారాధన కార్యక్రమం జరుగుతున్నట్లు సంక్షేమ సంఘం తెలిపింది. తద్వారా కుల ఐక్యతకు దోహదపడాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.
వివాహ సంబంధాలకు దరఖాస్తులు
ఈ సమావేశంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వివాహ సంబంధాల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుందని వారు తెలిపారు. శిష్టకరణ బంధువులందరూ ఈ వన సమారాధన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.
... News by: BSS Prasad

Post a Comment

0 Comments