✨ నడిమికెళ్ల గ్రామంలో ఆధ్యాత్మిక దివ్య మహాసభ

 

పాలకొండ వెబ్ న్యూస్ : నడిమికెళ్ల, వీరఘట్టం మండలం:

వీరఘట్టం మండలం నడిమికెళ్ల గ్రామంలో పాలకొండ శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దివ్య మహాసభ, నామస్మరణ కార్యక్రమం జరిగింది. ముందుగా భజన, అనంతరం సత్సంగ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సమితి ప్రతినిధి శ్రీ ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. కలియుగంలో ధర్మం నశించి, ఈర్ష్య, అహంకారాలు పెరిగాయని, అందుకే భగవానుడు ప్రతి యుగంలో అవతరిస్తాడని అన్నారు. నేటి మానవులకు శాంతి, ఆనందం కొరవడ్డాయని, అవి కేవలం భగవంతుని వద్ద మాత్రమే ఉన్నాయని, వాటి కోసం ప్రతి ఒక్కరూ పూజలు, సేవలు చేయాలని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments