అమరావతి/పాలకొండ: వెబ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజనపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. కొత్తగా మరో 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు అందాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్ల కోసం కూడా వినతులు వచ్చాయన్నారు. పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
🔹 పాలకొండ ప్రజల చిరకాల కోరికపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించి కీలక హామీ ఇచ్చారు.
* శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి పీహెచ్‌సీ ప్రారంభోత్సవంలో పాలకొండ సాధన సమితి ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ పడాల భూదేవి సమక్షంలో సమితి ప్రతినిధులు మంత్రిని కలిశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఆమె మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను పాలకొండను శ్రీకాకుళం జిల్లాలో విలీనం చేసే విషయంలో సానుకూల చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
* పాలకొండ శ్రీకాకుళంలోనే ఉండాలనే కోరికను వివరించారు.
* కేంద్రమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారు.
🔹 సీఎం దృష్టికి అంశం
"పాలకొండ శ్రీకాకుళంలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష" అని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
* ఈ అంశాన్ని వన్ మాన్ కమిటీకి తెలియజేస్తాను.
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తాను.
* పాలకొండను శ్రీకాకుళంలో విలీనం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
* దశాబ్దాల అనుబంధాన్ని, ప్రజల మనోభావాలను పరిశీలిస్తానని తెలిపారు.
గౌరవ మంత్రి కలిసిన వారిలో సాధన సమితి గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరినాయుడు,అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు,సాధన సమితి నాయకులు సబ్బ నానాజీ, తుమ్ముగుంట శంకర్రావు,రుంకు రామకృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణ, పాత్రికేయులు బి శివశంకర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ గుమ్మడి సింహాద్రి, బిజెపి నాయకులు పవన్ సాయి, పైల అక్కల నాయుడు,రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు వెన్నపు వెంకట రమణ,దుంపల రమేష్ బాబు,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు దుప్పాడ గణేష్,శాసపు సర్వారావు,గుమ్మడి గోవింద రావు, గుడివాడ నీటి సంఘం డైరెక్టర్ పామోటి వైకుంఠరావు
తదితరులు పాల్గొన్నారు.
🔹 కృషి చేసిన వారికి కృతజ్ఞతలు
పాలకొండ జిల్లా సాధన సమితి ఈ సందర్భంగా పలువురికి కృతజ్ఞతలు చెప్పింది. ప్రజల నిరసనలకు మద్దతుగా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
పాలకొండ వెబ్ న్యూస్ కవరేజ్ : బి. శివశంకర ప్రసాద్ (ఎడిటర్), జొన్నలగడ్డ కామేశ్వరరావు( చీఫ్ సబ్ ఎడిటర్) టి. సింహాచలం (శ్రీకాకుళం ఇంచార్జ్), జి. రఘు నాథ్ (పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ ).
In English version
Amaravati/Palakonda: Web News: The discussion on the division of districts in the state of Andhra Pradesh has started again. Suggestions have been received for the formation of 8 more new districts. This was said by the State Revenue Minister, Satya Prasad. He said that requests have also been received for new revenue divisions. He clarified that the final decision will be made keeping in mind the ease of administration.
🔹 Union Minister Kinjarapu Rammohan Naidu responded positively to the long-standing desire of the people of Palakonda and gave a key assurance.
* Representatives of the Palakonda Sadhana Samiti met him at the inauguration of the Kallepalli PHC in Srikakulam district.
* He explained the desire for Palakonda to remain in Srikakulam.
* The Union Minister responded positively to this.
🔹 Issue for the attention of the CM
"It is the aspiration of the people that Palakonda should remain in Srikakulam," said Minister Rammohan Naidu.
* I will inform the One Man Committee about this issue.
* I will bring it to the attention of Chief Minister Chandrababu Naidu.
* He assured that he will do his best to merge Palakonda with Srikakulam.
* He said that he will consider the decades-long association and the sentiments of the people.

Among those who met the Honorable Minister were Sadhana Samiti Honorary President Kanapaka Choudharinaidu, President Budithi Appalanaidu, Sadhana Samiti leaders Sabba Nanaji, Thummugunta Shankar Rao, Runku Ramakrishna, Press Club President Vallur Satyanarayana, journalists B Sivashankara Prasad, Telugu Desam Party Pattana former Gummadi Simhadri, BJP leaders Pawan Sai, Paila Akkala Naidu, Retired Army Employees Welfare Association leaders Vennapu Venkata Ramana, Dumpala Ramesh Babu, Building Construction Workers Association leaders Duppada Ganesh, Sasap Sarvarao, Gummadi Govinda Rao, Gudivada Water Association Director Pamoti Vaikuntha Rao
and others.
🔹 Thanks to those who worked
Palakonda District Sadhana Samiti thanked many people on this occasion. It thanked the media for supporting the people's protests.
Palakonda Web News Coverage: B. Sivashankara Prasad (Editor), Jonnalagadda Kameswara Rao (Chief Sub-Editor) T. Simhachalam (Srikakulam In-charge), Gotivada Raghunath (Palakonda Constituency In-charge).
0 Comments