* శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈరోజు (నవంబర్ 01, 2025) జరిగిన తొక్కిలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
* కార్తీక ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
* ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
* మంత్రి అచ్చెన్నాయుడు హుటాహుటిన దేవాలయానికి బయలుదేరారు.
* మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
* పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం వద్ద అదనపు పోలీసు బలగాలను తరలించి, క్షణక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
0 Comments