ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల REMS స్కీమ్ పునరుద్ధరణ: ఈయూ హర్షం

విజయనగరం, నవంబర్ 1:ఆర్టీసి రిటైర్డు ఉద్యోగుల మెడికల్ స్కీమ్ (REMS) పునరుద్ధరణపై ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.యు) రాష్ట్రకమిటి, విజయనగరం జోనల్ & జిల్లా కమిటీల తరపున హర్షం వ్యక్తం చేశారు. ఇ.యు స్టేట్ డిప్యూటీ జెనరల్ సెక్రటరీ పి.బానుమూర్తి, జోనల్ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బాసురు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి జి.రవికాంత్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.ఇ.యు రాష్ట్రకమిటి కృషి ఫలితంగా ఈ పథకం తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. 2020కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులు రూ.25,000, సూపర్‌వైజర్లు మరియు అధికారులు రూ.27,000 చెల్లించి సభ్యులైతే జీవితకాల వైద్యసదుపాయాలు లభిస్తాయి. 2020 తర్వాత రిటైర్ అయినవారు రూ.38,572, అధికారులు రూ.51,429 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చని తెలిపారు. మునుపటి విధంగానే రిటైర్డు ఉద్యోగులకు మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ విజ్ఞప్తి చేసిందని, ఆర్టీసి యం.డి గారు ఆ అంశంపై హామీ ఇచ్చారని పి.బానుమూర్తి తెలిపారు.

Post a Comment

0 Comments