సీతంపేటలో పర్యాటక ఉత్సవం ప్రారంభం 🎈హాట్ ఎయిర్ బెలూన్‌తో మన్యం అందాలను తిలకించే అవకాశం🏞️

సీతంపేట, నవంబర్ 1:
సీతంపేట (మండలం): మన్యం అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ సీతంపేటలో టూరిజం సీజన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మెట్టగూడ జలపాతం వద్ద జరిగిన టూరిజం సీజన్ స్టార్ట్ కార్యక్రమాన్ని మహిళా & శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారు, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ గారు లాంఛనంగా ప్రారంభించారు.
బైక్ ర్యాలీతో సందడి:
సీతంపేట మన్యమందాలు రాష్ట్ర పర్యాటక పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకునేందుకు ఈ కార్యక్రమం కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు. అనంతరం, మెట్టగూడ జలపాతం నుంచి సీతంపేట వరకు నిర్వహించిన ఉత్సాహభరితమైన బైక్ ర్యాలీని గిరిజన మంత్రి ప్రారంభించి, ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచారు.
హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి:
పర్యాటకులకు మధురానుభూతిని అందించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తెచ్చారు. సీతంపేటలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రత్యేక ఆకర్షణను ప్రారంభించారు. బెలూన్‌లో గాల్లో విహరిస్తూ అద్భుతమైన మన్యం అందాలను తిలకించే అవకాశం పర్యాటకులకు కలగనుంది. టూరిజం సీజన్ ప్రారంభంతో ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.

Post a Comment

0 Comments