![]() |
పాలకొండ, (కళాభారతి న్యూస్/పాలకొండ వెబ్ న్యూస్):
తిరుమల తిరుపతి దేవస్థానం (తి.తి.దే.) ఆధ్వర్యంలో పాలకొండ మండలంలోని ఎం. సింగిపురం గ్రామంలో 'మన గుడి' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తి.తి.దే. ప్రచారకులు గొలువె మోహన్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆధ్యాత్మిక విషయాలపై వివరణ:
ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ... మన గుడి విషయంలో ఆచార, ఆధ్యాత్మిక అంశాలను, విద్యా విషయాలను గ్రామస్తులకు విపులీకరించారు. ఆధ్యాత్మిక చింతనతో కూడిన పలు విషయాలను ఆయన స్పష్టం చేశారు. గ్రామస్తులు ఆయన సందేశాన్ని శ్రద్ధగా ఆలకించారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రణస్థలం రమాదేవి, రణస్థలం రాంబాబు, భోగాపురం కామేశ్వరరావు, నేపాకుల మురళీధర్, యెన్ని ముత్యాల నాయుడు, నేపాకుల సుదర్శన్ రావు, మునగవారు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలన్న వారి సందేశంతో కార్యక్రమం విజయవంతమైంది. News by : BSS Prasad


0 Comments