భామిని మండలం బత్తిలిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

(పాలకొండ వెబ్ న్యూస్) భామిని మండలం బత్తిలిలో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు (MLC) పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు గత ప్రభుత్వం మంజూరు చేసిన 17 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వాలనే కూటమి ప్రభుత్వ యత్నం దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధర్మారావు, సర్పంచ్ టింగ్ శాంతికుమారి, ఎంపీటీసీ టింగ అన్నాజీ, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments