పాలకొండలో సత్య సాయి బాబా శత దినోత్సవ జన్మదిన వేడుకలు ఘనం

పాలకొండ వెబ్ న్యూస్ : నవంబర్ 23:
భగవాన్ సత్య సాయి బాబా వారి శత దినోత్సవ జన్మదిన వేడుకలను పాలకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ (ఐ.ఏ.ఎస్.) ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు పాలకొండ తాసిల్దార్ కృష్ణ రాధాకృష్ణ, డాక్టర్ మన్మధ రావు, రాధా రాణి, పల్లాకొండ బాబు,  ప్రముఖులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం సత్యసాయి ట్రూప్ వారిచే భక్తి గీతాలతో కూడిన ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం భక్తులందరికీ అన్న సమారాధన జరిగింది. సుమారు 8000 మందికి అన్నదానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కన్వీనర్ కె సుధాకర, ఆర్ కిషోర్, జి.శ్రీరామనాయుడు, ఎన్వి రమణ, రమేష్ పట్నాయక్, రాంబాబు, రమానంద్, మహేశ్వరి, స్వరాజ్యం మేడం సహా అనేకమంది సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments