సత్య సాయి టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతుల ప్రదానం

పాలకొండ, నవంబర్ 23 (నేటి ఆదివారం):
పాలకొండలోని సత్య సాయిబాబా సన్నిధిలో 'సరదా చదువులు' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యసాయి టాలెంట్ హంట్ ఎగ్జామ్ విజేతలకు నేడు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మామిడి వేణుగోపాల నాయుడు గారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మామిడి వేణుగోపాల్ నాయుడు (అడ్వకేట్), ఎంఈఓ ఆనందరావు, ఆధ్యాత్మిక ప్రసంగకులు రామ్మోహన్, జల్లు నారాయణరావు విచ్చేశారు.
విజేతలు, బహుమతులు వివరాలు:
టాలెంట్ టెస్ట్‌లో కత్తులు కవీటి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌కు చెందిన జి. చైతన్య ప్రథమ స్థానం (రూ. 5,000) దక్కించుకున్నారు. అంబకండి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌కు చెందిన వంశీకృష్ణ ద్వితీయ స్థానం (రూ. 3,000), తంపటపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌కు చెందిన ఐ. లహరి తృతీయ స్థానం (రూ. 2,000) సాధించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. సంస్థ కన్వీనర్ ఎన్.వి. రమణ, కో-కన్వీనర్ మరడాన సంపత్ కుమార్ ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసుదేవరావు జిఎస్ఎన్, పిఆర్టియు అధ్యక్షులు హేమిని కుమార్, ఉపాధ్యాయులు సురేష్, పాడి రామకృష్ణ, శ్రీరాములు, బౌరోతు శంకరరావు, నాగరాజు, వాసుదేవరావు, సతీష్, రామలక్ష్మి, శారదామని, సత్యప్రభ, గణపతి, గడ్డియ్య, ఎం. వి. రమణ తదితర ఉపాధ్యాయులు, సీనియర్ జర్నలిస్ట్ శివ శంకర్ ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments