: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ADWA) ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా, బుక్కురు గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోడ్‌ల అమలుకు సంబంధించిన జీఓ (GO) కాపీలను బహిరంగంగా దహనం చేశారు.
ADWA తీరుపై ఆగ్రహం:ఈ నిరసనలో బుక్కురు మహిళా సంఘం అధ్యక్షులు గోరు. పద్మా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ, కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం జరిగింది," అని ఆమె ధ్వజమెత్తారు.
రద్దు చేయాలని డిమాండ్:
ADWA ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుందని, ఈ నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్మిక హక్కులకు భంగం కలిగించే ఈ విధానాలను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, భవిష్యత్తులో ఉద్యమాలకు సమాయత్తం కావాలని గోరు. పద్మా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో N. హిమప్రభ, గుడ్. G.గౌరి, m. శిరీషా, k. రావణమ్మ, P. రామాలక్ష్మి, J. జ్యోతి తదితర ADWA నాయకురాళ్లు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
0 Comments