కేంద్ర మంత్రిగా, రాష్ట్రానికి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు విశేష సేవలు అందించిన స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రం నాయుడు సేవలు మరువలేనివి అని ప్రముఖ విద్యాసంస్థల అధినేత డాక్టర్ సి.ఎల్.నాయుడు అన్నారు. దివంగత నేత ఎర్రంనాయుడు 13వ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. పాలకొండలోని శ్రీ శివాజీ హిందీ శిక్షక్ మహా విద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రం నాయుడు చిత్రపటానికి డాక్టర్ నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎర్రన్న రాజకీయ జీవితమంతా ప్రజా అభివృద్ధికే అంకితమైందని కొనియాడారు. ఆయన అధికారంలో ఉన్న కాలంలో పాలకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని డాక్టర్ సి.ఎల్.నాయుడు వ్యాఖ్యానించారు.ఈ నివాళి కార్యక్రమంలో చొంగ శివానంద్, తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్ నాయుడు, గొట్టమంగళాపురం మాజీ సర్పంచ్ అల్లు బుల్లి బాబు, శ్రీ కోట దుర్గమ్మ వారి ఆలయ మాజీ చైర్మన్ శాసపు సర్వారావు పాల్గొన్నారు. కళాశాల సిబ్బంది రవి, సత్యనారాయణ, తరుణ్, రాంబాబుతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments