విజయవాడ/తిరుమల,
నవంబర్ 17:తిరుమల శ్రీవారి
దర్శనం కోసం ఎంపీలు, మంత్రులు,
ఎమ్మెల్యేల పేరుతో
నకిలీ టీటీడీ లేఖలు (టికెట్లు) విక్రయించే దళారుల వ్యవహారం మరోసారి వెలుగులోకి
వచ్చింది. తాజాగా, ఆంధ్రప్రదేశ్
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిసత్యకుమార్ యాదవ్పేరుతో
నకిలీ లేఖలు చలామణి కావడం తీవ్ర కలకలం సృష్టించింది.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని,
దళారులు ఈ నకిలీ
పత్రాలను విక్రయించి భారీగా నగదు దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు భక్తులు
మంత్రి సత్యకుమార్ పేరుతో ఉన్న నకిలీ లేఖలను కొనుగోలు చేసి, దర్శనానికి వెళ్లగా, టీటీడీ అధికారులు అవి నకిలీవని తేల్చి
వెనక్కి పంపారు.తాము మోసపోయామంటూ బాధితులు మంత్రి
కార్యాలయాన్ని ఆశ్రయించారు. గత కొంతకాలంగా మంత్రి పేరుతో ఈ నకిలీ లేఖలు జారీ
అవుతున్నట్లు గుర్తించిన మంత్రిసత్యకుమార్ పీఏ, ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు
చేపట్టాలని కోరుతూ విజయవాడ నగర సీపీరాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నకిలీ టికెట్ల విక్రయాలపై పోలీసులు పలువురిని
అరెస్టు చేసినప్పటికీ, ఈ
మోసాలు మళ్లీ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా మోసగాళ్లపై కఠిన చర్యలు
తీసుకోవాలని భక్తులు టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
News by : Boddepalli Venkata Ramana.
Post a Comment
0
Comments
Total Pageviews
PALAKONDA TEMPLES
🛕
పాలకొండ ఆలయాల సమాచారం
మన ప్రాంతంలోని పురాతన దేవాలయాల విశిష్టత, చరిత్ర మరియు పూజా వివరాలు ఇక్కడ చదవండి.
🎯 మా వద్ద తెలుగు & ఇంగ్లీష్ భాషలలో అన్ని రకముల టైపింగ్ పనులు అత్యంత ఖచ్చితత్వంతో, వేగంగా చేయబడును.
📍 చిరునామా: మెయిన్ రోడ్, పాలకొండ.
📞 సెల్: 9985291832
— Free Advt —
🎉 🌟 🎊
PALAKONDA WEB NEWS
అపూర్వ విజయం! 1,00,000+వీక్షణలు
పాలకొండ వెబ్ న్యూస్ ఉచితంగా అందిస్తున్న నిష్పక్షపాత వార్తలను ఆదరిస్తూ, లక్షకు పైగా వీక్షణలు అందించిన మా ప్రియమైన పాఠకులకు మరియు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు! 🙏
0 Comments