శ్రీ ధర్మశాస్త్ర పీఠంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం ఘనం

 పాలకొండ వెబ్ న్యూస్,  నవంబర్ 3:
శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప భక్తులు, శివ భక్తుల కోసం పల్లా కొండబాబు ఈరోజు స్థానిక శ్రీ ధర్మశాస్త్ర పీఠంలో అత్యంత భక్తితో మహా అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు వందమంది అయ్యప్ప స్వాములు, శివ భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించి, పల్లా కొండబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా, అయ్యప్ప భక్తులు పల్లా కొండబాబు మరియు వారి కుటుంబ సభ్యులకు స్వామియే శరణమయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహణలో శ్రీ ధర్మశాస్త్ర పీఠం నిర్వాహకులు, గురుస్వాములు పాలుపంచుకున్నారు. 

Post a Comment

0 Comments