జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నేటి ఉదయం 9:30 గంటలకు పాలకొండలో భారీ ర్యాలీ జరగనుంది. పాలకొండను జిల్లాగా ప్రకటించాలంటూ, లేకుంటే శ్రీకాకుళం జిల్లాలో కలపాలంటూ ప్రజలు గళమెత్తారు.శ్రీ కోట దుర్గమ్మ గుడి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది అని పాలకొండ జిల్లా సాధన సమితి తెలియ జేసింది రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న పాలకొండ జిల్లా అవ్వాలని ఇది ప్రజల ఆకాంక్షని. సమితి గౌరవాధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, నేతలు బుడితి అప్పలనాయుడు తదితరులు ర్యాలీకి నేతృత్వం వహిస్తారు. జిల్లా సాధన కోసం సభలు, రిలే దీక్షలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు.
ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు.“పాలకొండ జిల్లా సాధనకై ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలి” అని నేతలు పిలుపునిచ్చారు.
0 Comments