పెట్టుబడులు, జిల్లాల పునర్విభజనపై నేడు ఏపీ కేబినెట్

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు (ఇన్వెస్టర్స్ సమ్మిట్) ఏర్పాట్లపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రానున్న రూ. లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అలాగే, కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలో కీలకమైన జిల్లాల పునర్విభజన, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రిమండలి చర్చించి, తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు సంస్థలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంటారు. ఇతర కీలకాంశాల్లో భాగంగా... మొంథా తుఫాన్ ప్రభావం, పంట నష్టం అంచనాలు, రైతులకు పరిహారంపై చర్చ జరగనుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏకు NaBFID నుంచి రూ. 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments