విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన మొబైల్ వాహనం ప్రారంభం

📚 పాలకొండ వెబ్ న్యూస్ , నవంబర్ 28: పాలకొండ పట్టణంలో విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన మొబైల్ వాహనం  లాంఛనంగా ప్రారంభమైంది.
పాలకొండ గార్ల పంచాయతీ మెయిన్ రోడ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు, ఐదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వెలమల మన్మధరావు దీనిని ప్రారంభించారు.
ఇతర కౌన్సిలర్లు, స్థానిక మిత్రులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పుస్తక ప్రియులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు, విద్యార్థులకు పుస్తకాలను చేరువ చేయడమే ఈ ప్రదర్శన లక్ష్యం. వివిధ రకాల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు.
పుస్తకాలను కొనుగోలు చేయడానికి పట్టణవాసులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు.

Post a Comment

0 Comments