పాలకొండ వెబ్ న్యూస్ : నవంబర్ 22, 2025: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, వాటి అమలుకు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో పాలకొండ డివిజన్ కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్ లను నోటిఫై చేయడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికే పనిచేస్తోందని మరోసారి రుజువైందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. బీహార్ ఎన్నికల అనంతరం వీటిని నోటిఫై చేయడం ద్వారా తన కుటిలత్వాన్ని బయటపెట్టుకుందని పేర్కొన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై, లేబర్ కోడ్ ల రద్దుకు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ పాలకొండ మండల కార్యదర్శి కాద రాము, రైతు సంఘం సీనియర్ నాయకులు ఖండాపు ప్రసాదరావు, భవన నిర్మాణ కార్మికులు ఎస్ గంగరాజు, ఎం సత్యనారాయణ, సిహెచ్ శంకర్రావు, ఆర్ ప్రసాదు, ఏ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
0 Comments