పాలకొండ వెబ్ న్యూస్ , నవంబర్ 22, 2025: సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పార్వతీపురం మన్యం జిల్లా మరియు అసిస్టెంట్ సూపెరిమెంట్ ఆఫ్ పోలీస్ పార్వతీపురం వారి సూచనల మేరకు, పాలకొండ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో మహిళలు, బాల బాలికల రక్షణ కోసం రూపొందించబడిన 'శక్తి' యాప్ యొక్క ఉపయోగాలపై అవగాహన కార్యక్రమాన్ని పాలకొండ శక్తి టీమ్ నిర్వహించింది. స్థానిక వివేకానంద స్కూల్ మరియు వెంకంపేట జెడ్పీహెచ్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా ఏఎస్ఐ ఝాన్సీ భాయ్ మాట్లాడుతూ, మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం 112 నెంబరుకు కాల్ చేయవచ్చని తెలిపారు. అలాగే, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ మంచి చెడులను గుర్తించి, తల్లిదండ్రులు, పెద్దవారు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ, బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. బాలబాలికల రక్షణ కోసం 1098, సైబర్ క్రైమ్ కోసం 1930 నంబర్లను సంప్రదించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు WASI ఝాన్సీ భాయ్, WHC ప్రకృతాంబ, PCs గణపతి, రాము, గణేష్ లు పాల్గొన్నారు.
0 Comments