పాలకొండ వెబ్ న్యూస్: వీరఘట్టం మండల పరిధిలోని ఎంపీయూపీ స్కూల్ పాలమెట్ట విజయ రాంపురం లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగం గొప్పదనాన్ని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
🏆 విద్యార్థులకు పోటీ పరీక్షలు, ప్రోత్సాహం : వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో రాజ్యాంగం, సామాజిక అంశాలపై అవగాహన పెంచేందుకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించి, వారికి పాఠశాల యాజమాన్యం తరపున మెమెంటోలు మరియు సర్టిఫికెట్లను అందజేసి ప్రోత్సహించారు.
💐 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలికి సన్మానం :
అలాగే, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని కొంచాడ లక్ష్మీ కి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆమె సేవలను కొనియాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరడాన సంపత్ కుమార్, ఉపాధ్యాయులు జె. పద్మావతి, కొత్తపల్లి సురేష్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments