పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నియోజకవర్గంలో ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


పాలకొండ వెబ్ న్యూస్ : భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పాలకొండ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.

స్థానిక శాఖా గ్రంథాలయం పాలకొండలో జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు మరియు అడ్మిన్ శివ కుమార్ గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యున్నతమైన భారత రాజ్యాంగం సాధారణ పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకు, గ్రామ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని నిర్దేశిస్తుందని పేర్కొన్నారు.

  • 1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదా ఆమోదం పొందిందని, 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు.

  • రాజ్యాంగంలోని ప్రధాన అంశాలైన పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక బాధ్యతలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ శివకుమార్, సీనియర్ పాఠకులు ఉరిటి ఫకీరు రావు, టి. శ్యామల రావు, పి. మధుసూదన రావు, సిహెచ్. సింహాచలం, సహాయకుడు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments