పాలకొండ, నవంబర్ 03 (వెబ్ న్యూస్): పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దీక్షలో ఉన్న శివ స్వాములకు అపూర్వరీతిలో అన్నప్రసాద వితరణ జరిగింది. సీతంపేట , మెట్టు హడ్డుబంగి గ్రామానికి చెందిన పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి గంట నాయుడు మరియు మంజుల దంపతుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం వేళ శివస్వాములకు అన్నప్రసాదం (భోజనం), రాత్రి వేళ దీక్షా నియమానికి అనుగుణంగా అల్పాహారం (టిఫిన్) అందజేశారు.శివనామ స్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణంలో, విశేష సంఖ్యలో తరలివచ్చిన శివ స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు. నిస్వార్థ భక్తితో దంపతులు చేసిన ఈ పుణ్య సేవ పట్ల శివ స్వాములు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మ, ఆధ్యాత్మిక భావనను చాటిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. News by; BSS Prasad:
In English Version
Ganta Naidu-Manjula couple's spiritual service
Palakonda, November 03 (Web News): The most important Shiva temple in Velagavada village of Palakonda mandal, Parvathipuram Manyam district, has acquired spiritual splendor. Annaprasada was distributed to Shiva Swamas who were undergoing initiation in an unprecedented manner. This service program was organized under the auspices of Ganta Naidu and Manjula couple, employees working in the Animal Husbandry Department of Mettu Haddubangi village in Seethampet. Annaprasadam (meal) was served to Shiva Swamas in the afternoon, and breakfast (tiffin) was served in the evening as per the initiation rules. In the temple premises, which was filled with the remembrance of Shiva's name, a large number of Shiva Swamas who had gathered received the prasadam with great devotion. Shiva Swami and devotees expressed their joy over this pious service performed by the couple with selfless devotion. This program, which conveyed the concept of Dharma and spirituality, impressed everyone. News by; BSS Prasad.
0 Comments