పశ్చిమ ముఖ గోకర్ణేశ్వర స్వామి ఆలయం: ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి! 🙏West-facing Gokarneshwara Swamy Temple: A rare spiritual experience!


 పాలకొండ వెబ్ న్యూస్ : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పాలకొండ పట్టణంలోని వివర్స్ కాలనీ శివారులో వెలసిన అత్యంత ప్రాచీన గోకర్ణేశ్వర స్వామి ఆలయం నిజంగా ఒక దివ్యక్షేత్రం. ఇక్కడ భక్తులంతా సోమవారం రోజున స్వామి దర్శనం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో వేచి ఉంటారు.
ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం యొక్క ప్రధాన విశేషం, ఇది పశ్చిమ ముఖాన దర్శనమివ్వడం. సాధారణంగా తూర్పు ముఖంగా మనకి ఎక్కువగా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి . కానీ పశ్చిమ ముఖంలో ఉండేటటువంటి శివలింగాలు ఆలయాలు చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి అది మన పాలకొండలో ఉండడం విశేషం మరియు పవిత్రమైన అవకాశం, మన పాలకొండలో లభించడం మన అదృష్టం.
మరీ ముఖ్యంగా, ఈ శివలింగంపై బ్రహ్మసూత్రం ఉండటం మరొక ప్రత్యేకత. ఈ బ్రహ్మసూత్రం దర్శించడం వల్ల, పశ్చిమ ముఖంగా శివుడిని దర్శించి ఆశీర్వాదం పొందడం వల్ల అద్భుత ఫలం లభిస్తుందని స్థల పురాణం చెబుతోంది. స్వామివారి దర్శనంతో సకల శుభాలు  కలుగుతాయని, ఆపదలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాగంటి కోటేశ్వరరావు గారి వంటి మహనీయులు సైతం ఈ శివలింగ ప్రాధాన్యతను వివరించారు. కాబట్టి, ఆధ్యాత్మిక చింతనతో ఉన్న మీరంతా తప్పకుండా ఈ అరుదైన గోకర్ణేశ్వర స్వామి శివాలయాన్ని సందర్శించి, పశ్చిమ ముఖ శివలింగం యొక్క దివ్యాశీస్సులు పొందాలి

West-facing Gokarneshwara Swamy Temple: A rare spiritual experience! 🙏

The ancient Gokarneshwara Swamy Temple, located on the outskirts of Vivars Colony in Palakonda town, is truly a divine place. Here, devotees wait with great devotion on Mondays for the darshan of the Lord. The main feature of the Shiva Linga in this temple is that it faces the west. Usually, we see Shiva Lingas facing the east. But temples with Shiva Lingas facing the west are very rare. It is a special and sacred opportunity to be in our Palakonda. We are lucky to have it in our Palakonda.
More importantly, the presence of the Brahma Sutra on this Shiva Linga is another special feature. The legend of the place says that by seeing this Brahma Sutra, seeing Shiva facing the west and receiving blessings will give wonderful results. It is a deep belief of the devotees that with the darshan of the Lord, all auspicious things will happen and dangers will be removed.  Even great people like Chaganti Koteswara Rao have explained the importance of this Shiva Linga. Therefore, all of you who are spiritually inclined should definitely visit this rare Gokarneswara Swamy Shiva Temple and receive the divine blessings of the west-facing Shiva Linga.
                                                                            ..  News by BSS Prasad (Editor)   
    

Post a Comment

0 Comments