పదో తరగతి విద్యార్థులకు 'వ్యాకరణ గుణ నిధి' పుస్తకాలు పంపిణీ

పాలకొండ వెబ్ న్యూస్: 2026 మార్చిలో జరగబోతున్న ఎస్ఎస్‌సీ పరీక్షల తర్ఫీదు నిమిత్తం తెలుగు భాష వ్యాకరణమునకు సంబంధించి తెలుగు విషయం నిపుణులచే తయారు చేయబడిన 'వ్యాకరణ గుణ నిధి' పుస్తకాలను ఇటీవల పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వండువ మరియు జిల్లా పరిషత్ పాఠశాల తలవరం ప్రధానోపాధ్యాయులు కే. సూర్యనారాయణ, ఎస్. రాజ్యలక్ష్మి వారి చేతుల మీదుగా ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. తెలుగు ఉపాధ్యాయులు కే. షర్మిల మేడం, చిట్టితల్లి మేడం ఆధ్వర్యంలో పదవ తరగతిలో వ్యాకరణం నుండి వచ్చే 32 మార్కులకు సంబంధించిన తర్ఫీదు నిమిత్తం ఈ గుణనిధి పుస్తకాలను పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కే. జనార్దన్ రావు, ఈ పుస్తకాలు సులభంగా, సరళంగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని, తద్వారా విద్యార్థులు తెలుగు భాష పట్ల మక్కువ కలిగి ఉంటారని తెలియజేశారు. అంతేకాక, పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాయపదాలు, అర్ధాలు, ఉత్పత్తి అర్ధాలు, నానార్ధాలు, చందస్సు, ప్రకృతి వికృతులు, సంశ్లిష్ట వాక్యాలు, సంధులు, సమాసాలు వంటి అంశాలను పిల్లలు చాలా సులభంగా నేర్చుకుంటారని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుంచి వ్యాకరణం అలవడితే భవిష్యత్తులో మంచి తెలుగు పండితులుగా తయారవుతారని జనార్దన్ రావు తెలియజేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో రెండు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Post a Comment

0 Comments