ఐదో తేదీన జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ (పీటీఎం)పై పీవీఆర్ పురం పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని మామిడి హిమశ్రీ ఇచ్చిన ఉపన్యాసం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, చదువుల ప్రాధాన్యం గురించి చిన్నారి మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది.
హిమశ్రీ మాట్లాడిన రెండు నిమిషాల నిడివి గల వీడియోను 'సరదా చదువులు' అనే యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన 24 గంటల్లోనే నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కేవలం ఒకే రోజులో ఆ వీడియోను దాదాపు 65 గంటలకు పైబడి వీక్షించడం విశేషం.
చిన్నారి ప్రతిభను నెటిజన్లు, ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థులు ప్రశంసల వర్షంతో ముంచెత్తారు. హిమశ్రీ ప్రతిభపై మండల విద్యాశాఖ అధికారులు గౌరీ నాయుడు, ఆనందరావు, ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలలో తన ప్రతిభను చాటాలని ఈ సందర్భంగా వారు చిన్నారిని అభినందించారు.
0 Comments