డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ

పాలకొండ వెబ్ న్యూస్ : 04-12-2025, గురువారం.
పాలకొండ పట్టణం నందు నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి (DLDO) కార్యాలయాన్ని పాలకొండ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయక్రిష్ణ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడానికి మరియు డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఈ నూతన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ తో పాటు, కూటమికి చెందిన వివిధ హోదాలలో ఉన్న ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నూతన కార్యాలయం పాలకొండ డివిజన్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. జయక్రిష్ణ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడానికి మరియు డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఈ నూతన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ తో పాటు, కూటమికి చెందిన వివిధ హోదాలలో ఉన్న ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నూతన కార్యాలయం పాలకొండ డివిజన్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments