పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో స్థానిక పాలకొండ నియోజక వర్గ ఎమ్మెల్యే జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొంటారు. ఆధునిక వసతులతో సిద్ధమైన ఈ ఆసుపత్రి ప్రారంభంతో గిరిజన ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం స్థానికంగానే అందుబాటులోకి రావడం వల్ల దూర ప్రయాణాల భారం తగ్గుతుందని వారు భావిస్తున్నారు.
0 Comments