డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురు కులాల్లో ప్రవేశాలకు సాంఘిక సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ స్కూల్స్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ మంగళవారం ఆ నోటిఫికేషన్ ను జారీ చేశారు. గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడి యట్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామని, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లలో కూడా ప్రవేశాలు ఇస్తామని తెలిపారు. అర్హత కలిగిన బాలబాలికలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకూ దర ఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం విజయవాడ కేంద్రంగా నీట్ కోచింగ్ కూడా ప్రారంభించామన్నారు.
0 Comments