పాలకొండ వెబ్ న్యూస్ : డ్రగ్స్ రహిత పాలకొండకై నడుం బిగిద్దాం అని పాలకొండ డీఎస్పీ రాంబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ, గంజాయి రవాణా మరియు వాడకంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని హెచ్చరించారు. కేవలం చట్టాలు, అరెస్టుల వల్ల మాత్రమే మార్పు రాదని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని కోరారు. యువత చెడు సావాసాలకు దూరంగా ఉండి, చదువు మరియు క్రీడలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఆరోగ్యమే మహాభాగ్యం - యోగా గురువుల సందేశం.. యోగా గురువు జనార్దన్ మాస్టర్, గారాల సూర్యం మాస్టర్, బొడ్డు రామ్మోహన్ మాట్లాడుతూ, శారీరక, మానసిక దృఢత్వానికి యోగా మరియు క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు మెదడును నిర్వీర్యం చేస్తాయని, యువత యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించి, వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు.
అనంతరం పాలకొండ ప్రధాన కూడళ్ల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. "గంజాయి వద్దు - జీవితం ముద్దు", "మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం - సమాజాన్ని రక్షిద్దాం" అంటూ యువత చేసిన నినాదాలతో పాలకొండ వీధులు హోరెత్తాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లా కొండబాబు, మరియు గంటా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పాలకొండను గంజాయి రహిత పట్టణంగా మార్చడానికి ప్రతి పౌరుడు సహకరించాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ చైతన్య కార్యక్రమం స్థానిక ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది.
0 Comments