పాలకొండలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

పాలకొండ వెబ్ న్యూస్ : స్థానిక బార్ అసోసియేషన్ కోర్టు ఆవరణలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని ఫౌండేషన్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అరకు పార్లమెంట్ కన్వీనర్ ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా పేదలకు, అనాథలకు అవసరమైన న్యాయపరమైన సహాయ సహకారాలను నిరంతరం అందిస్తామని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవలో ముందుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు టి. సింహాచలం, కె.వి. రమణ, ఎన్. సింహాచలం, కె. ఆనంద్ కుమార్, కె. ఉమా శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments