పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ ఈనెల 20వ తేదీ వరకు సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో ఇంచార్జ్ సబ్ కలెక్టర్‌గా దిలీప్ చక్రవర్తి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎల్విన్ పేట గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, సీతంపేట ఐటిడిఏ పిఓగా సేవలందిస్తున్న ఆయనకు ప్రభుత్వం ఈ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా పాలకొండ తాసిల్దార్ రాధా కృష్ణమూర్తి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
0 Comments