పుస్తకం..రేపటి వెలుగు..

మొబైల్ తెరల మాయాలోకం వదిలి
అక్షరాల అద్భుత లోకంలోకి అడుగుపెడదాం..
సెలవుల సరదాను, సాయంత్రపు సందడిని
పుస్తక మహోత్సవాల వేదికగా మారుద్దాం!
తినే తిండి శరీరానికి పుష్టినిస్తే..
చదివే పుస్తకం మనిషి వ్యక్తిత్వానికి ప్రాణమిస్తుంది!
కొడవటిగంటి చెప్పిన సత్యమిదే -
పుస్తకమే మనిషి నడకను, నడతను మారుస్తుంది.
కొన్ని కాలగర్భంలో కలిసిపోయినా..
మరికొన్ని చిరకాలం వెలుగుతూనే ఉంటాయి.
భాషపై మమకారం ఒక తీయని బంధమైతే..
పుస్తక పఠనం తరతరాల విజ్ఞాన వారసత్వం!
వీరగాథలు, చరిత్రలు, పర్యావరణ పాఠాలు
పిల్లల చేతుల్లో విజ్ఞాన దీపాలు కావాలి.
మంచి పుస్తకం అందించే సంస్కృతిని
ప్రతి తల్లిదండ్రూ బాధ్యతగా స్వీకరించాలి.
"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో -
కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో!"
కందుకూరి మాటను గుండెల్లో నింపుదాం..
చదువుల వెలుగులో నవ సమాజాన్ని నిర్మిద్దాం!
 రచన.. బి.హెచ్. శివశంకర ప్రసాద్ జర్నలిస్ట్.. పాలకొండ

Post a Comment

0 Comments