ప్రయాణికులకు ఊరట: ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె విరమణ- ప్రభుత్వంతో చర్చలు సఫలం.. నేటి నుంచి యధావిధిగా సేవలు- పండుగ వేళ తప్పిన రవాణా కష్టాలు

పాలకొండ, వెబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె సమస్య సుఖాంతమైంది. ఈ నెల 12వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వ జోక్యంతో అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
అధికారులతో కీలక చర్చలు:
యజమానుల సంఘం నాయకులు తమ 5 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) కు అందజేశారు. పెండింగ్ బకాయిల విడుదల, కిలోమీటరు ధర పెంపు తదితర కీలక అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ లభించడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు నేతలు వివరించారు.

Post a Comment

0 Comments