పాలకొండ వెబ్ న్యూస్: దేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పట్టణంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం, పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు నాగమణి, గౌతమి, జయప్రద, స్వర్ణలతలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు వడమ పుష్పనాధం మాట్లాడుతూ, అజ్ఞానాన్ని పారద్రోలి మహిళా చైతన్యానికి పూలే బాటలు వేశారని కొనియాడారు. విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యమని ఆమె ఆశయాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉదయ బాబు, జీవరత్నం, పరంకుశం నాయుడు, గోపి, రామ్ లాల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments