అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారి తేజశ్రీకి ఆర్థిక సాయం

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కొత్త వీధికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి తేజశ్రీ ఇటీవల అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ప్రస్తుతం రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న వడ్డి ప్రవీణ్, కుమిలి దిలీప్ కుమార్, కోట్ని సాయిప్రసాద్ తదితరులు మిత్రులతో కలిసి రూ.10,000 నగదు సేకరించి చిన్నారి కుటుంబానికి అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో బరాటం మాధవరావు, రావాడ రవికుమార్ పాల్గొన్నారు. ఆర్థిక సాయం చేసిన మిత్రబృందాన్ని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

Post a Comment

0 Comments