ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సిఐటియు పిలుపు

పాలకొండ వెబ్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు పాలకొండ కమిటీ కోరింది. మంగళవారం పాలకొండ నగర పంచాయతీ ఆవరణలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధుల కోత విధించి, కొత్త పథకాల పేరుతో దాని స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ వాణిజ్య ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం నష్టపోతోందని, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే భారత్ బంద్‌లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సంజీవి, వి ఆంజనేయులు, రఘు, కార్తీక్ సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments