శ్రీముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా

శ్రీముఖలింగ క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తుది ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లో ప్రతి లైన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

​సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా భద్రతను పటిష్టం చేయాలని ఏఎస్పీ కేవీ రమణకు సూచించారు. ముఖ్యంగా 18వ తేదీన జరిగే చక్రతీర్థ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తుల రద్దీని బట్టి క్యూలైన్లను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి డిఎస్పి లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments