స్థానిక ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. రామ్మోహన్ మాట్లాడుతూ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారని, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, మహాభారతం రచించి, అష్టాదశ పురాణాలను లోకానికి అందించిన మహర్షి వేదవ్యాసుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలియజేసారు. ఈసందర్భంగా యోగా గురువులను సన్మానించారు. ఈకార్యక్రమంలో రామారావు గురూజీ, డి.శ్రీనివాసరావు, శ్రీరామచంద్రమూర్తి, కే. శ్రీనివాసరావు మరియు పాలకొండ, సీతంపేట యోగ సభ్యులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments