ఏప్రిల్ 1 నుంచి జనగణన: గృహ జాబితా ప్రక్రియకు ఏర్పాట్లు

​పాలకొండ వెబ్ న్యూస్: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా గృహాల జాబితా మరియు లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం జీవో 23ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ గణన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మే 1 నుంచి 30 వరకు మొదటి విడత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలను ఏప్రిల్ 15 నుంచి 30 లోపు పూర్తి చేయాలని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయకుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా వివరాలు సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు

Post a Comment

0 Comments