పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక గ్రంథాలయాభివృద్ధికి రావాల్సిన పన్ను బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మండల ప్రజాపరిషత్ అధికారి M.V. రంగా రావుకు ఇంచార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు వినతి పత్రం సమర్పించారు. గ్రామాల్లో సెక్రెటరీలు వసూలు చేస్తున్న ఇంటి పన్నుల్లో గ్రంథాలయ సెస్ కలిపి ఉన్నప్పటికీ, చాలా ఏళ్లుగా ఆ నిధులు గ్రంథాలయ సంస్థకు చలానా రూపంలో జమ కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు వస్తేనే విద్యార్థులకు అవసరమైన కొత్త పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. నగర పంచాయతీ నుండి కూడా 8 లక్షల రూపాయలకు పైగా బకాయిలు రావాల్సి ఉందని, దీనివల్ల పాఠకులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని గణేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments