జాతీయ నులి పురుగుల దినోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆశ వర్కర్లు మహేశ్వరి, కన్యాకుమారిలు సుమారు 350 మంది విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ పైల శంకర్రావు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై శ్రద్ధ వహించగలరని, నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనతను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు గేదెల గోవిందరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు మరియు బీవీటి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మాత్రల వినియోగంపై అవగాహన కల్పించారు.

Post a Comment

0 Comments