ఉపాధిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

పాలకొండ వెబ్ న్యూస్: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు కోరారు. గత పదేళ్లలో జరిగిన సోషల్ ఆడిట్ ద్వారా పథకంలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, లక్షలాది మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినట్లు ఉద్యానవన పంటలు, గోశాలల నిర్మాణాలకు ఈ నిధులను మళ్లించాలని డిమాండ్ చేశారు. పాలకొండ పరిధిలోని సర్సింహ చెరువు ఉదాహరణగా చూపిస్తూ, పదేళ్లలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఉపాధి హామీని రైతులకు మేలు చేసేలా మార్చాలని ప్రసాదరావు కోరారు.

News by: BSS Prasad

Post a Comment

0 Comments