పాలకొండ వెబ్ న్యూస్
సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి గణిత క్విజ్ పోటీల్లో యం.పి.యు.పి పాఠశాల, బుక్కూరు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు.
పాలకొండ మండల గణితోపాధ్యాయులు జయరావు పర్యవేక్షణలో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ క్విజ్‌లో బుక్కూరు పాఠశాలకు చెందిన విద్యార్థులు దుష్యంత్ నాయుడు, రేణుక, హేమ చంద్ర, ఆది లక్ష్మి, హేమలత తమ మేధస్సుతో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు.
అభినందనల జల్లు:
విజేతలుగా నిలిచిన విద్యార్థులను, వారికి తర్ఫీదునిచ్చిన పాఠశాల సిబ్బందిని పాలకొండ మండల విద్యాశాఖాధికారులు P. కృష్ణమూర్తి, K. సోంబాబు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
0 Comments